9 July, 2026 | 12:15 PM

కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామాలు అభివృద్ధి సాధ్యం

09-07-2026 11:03 AM

 ఎంపీ గోడం నగేష్ 

బెజ్జూర్ జూలై 8 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామాలు అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ అన్నారు. బెజ్జూర్ మండలంలోని పోతేపల్లి గ్రామంలో రూ. 40 లక్షల అంచనాలతో  బారెగూడ గ్రామంలో రూ.25 లక్షల అంచనాలతో నిర్మించిన సిసి రోడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో  ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దవాగుపై చెక్ డాం నిర్మాణంతో రైతులు రెండు పంటలు సాగు చేసుకుంటున్నారని అన్నారు.

ప్రతి మండలానికి రెండు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని దీనితో గ్రామాలలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఏమీ లేదని, కేంద్ర ప్రభుత్వ నిధుల తోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. గ్రామపంచాయతీలలో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వ నిధుల తోటి గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తేలి సుశీల బాపు, రామకృష్ణ,భాజపా జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, మాజీ ఎంపీపీలు మనోహర్ గౌడ్, కొప్పుల శంకర్,జాడి దిగంబర్, ఎక్కరి సంజు, వసి ఖాన్, కోలా కిష్టయ్య, గూడా రాకేష్, సంతోష్, బిక్షపతి, ఉమ్మారే బాలకృష్ణ, లింగాల శంకరయ్య, వెంకటేష్, ముంజం రుషి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.