9 July, 2026 | 1:14 PM

ఈశ్వరమాదారంలో ఆధ్యాత్మిక వెల్లువ..

09-07-2026 12:02 PM
  1. విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో పాల్గొన్న కందాళ దంపతులు!
  2. ఆలయ అభివృద్ధి కొరకు 10 లక్షల భారీ విరాళం అందజేత

కూసుమంచి, జులై 9(విజయక్రాంతి): కూసుమంచి మండలం, ఈశ్వరమాదారం గ్రామంలో జరిగిన ఆధ్యాత్మిక మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తమ సతీమణితో కలిసి గురువారం పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు కందాళ దంపతులు హాజరై, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అభివృద్ధికి భారీ విరాళం

ఆధ్యాత్మికతతో పాటు గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే కందాళ ఉపేందర్ రెడ్డి, ఈ ఆలయ నిర్మాణ పనుల కోసం రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు స్థానిక సర్పంచ్  భారీ ఎత్తున స్వాగతంపలికి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, మండల మాజీ ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు