5 June, 2026 | 1:09 AM

ప్రజా భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి

05-06-2026 12:00 AM

కలెక్టర్ గరిమ అగ్రవాల్

కోనరావుపేట, జూన్ 4 (విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించవచ్చని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రా మంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పంటల వైవిధ్యం, రోడ్డు భద్రత, ఓటరు జాబితా సవరణ, వనమహోత్సవం, బడిబాట తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి శాస్త్రీయంగా నిర్వహించాలని, సింగిల్ యూ జ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూ చించారు.రైతులు పంట మార్పిడి, ఆయిల్ పామ్, కూరగాయలు, సన్న వడ్ల సాగుపై దృష్టి పెట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అనంతరం గ్రామ నర్సరీ, కం పోస్ట్ షెడ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.