5 June, 2026 | 1:10 AM

జిల్లాలో ఎస్‌ఐల బదిలీలు

05-06-2026 12:00 AM

పెద్దపల్లి, మంథని, జూన్ 4 (విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్‌పెక్టర్లను గురువారం బదిలీ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  ఉత్తర్వులు జారీ చేశారు. మంథని ఎస్‌ఐగా పనిచేస్తున్న డేగ రమేష్‌ను సిసిఎస్‌కు బదిలీ చేశారు. సిసిఎస్‌లో పనిచేస్తున్న జీవన్‌ను పెద్దపల్లికి, పెద్దపల్లి రూరల్‌లో పనిచేస్తున్న మల్లేష్‌ను జూలపల్లికి, జూలపల్లిలో పనిచేస్తున్న సనత్ ను పొత్కపల్లికి, సుల్తానాబాద్‌లో పనిచేస్తున్న నరేష్‌ను పెద్దపల్లి రూరల్ పీఎస్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.