4 March, 2026 | 8:37 PM

హోలీ సంబరం జరుపుకుంటున్న గ్రామస్తులు

04-03-2026 07:19 PM

కుభీర్: భైంసా డివిజన్ పరిధిలోని కుబీర్ బైంసా తానూర్ రైతుల మండలాల్లో బుధవారం హోలీ పండుగను జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు సల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో హోలీ ఉత్సవ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కేలో జరిగిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బందెల సత్యనారాయణ మాట్లాడుతూ... హిందూ పురాణ కథ ప్రకారం చెడుపై మంచి గెలిచిన దానికి సంకేతం హోళి అన్నారు. గోడపూర్ లో సర్పంచ్ దత్త హరి పటేల్, నాయకులు ఆయా గ్రామాల ప్రజలు యువకులు పాల్గొన్నారు.