5 March, 2026 | 12:08 AM

సిపిఎం మోతె మండల కార్యదర్శిని సిపిఎం పార్టీ నుండి బహిష్కరణ

04-03-2026 07:25 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

మోతె,(విజయక్రాంతి): సిపిఎం పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగించేలా అనైతిక చర్యకు పాల్పడిన సిపిఎం పార్టీ మోతె మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డిని సిపిఎం పార్టీనుండి బహిష్కరిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుండి ఆయనకు సిపిఎం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన పాల్పడిన అనైతిక చర్య వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగినట్టుగా భావిస్తున్నామన్నారు.