పోతారంలో గాలివానకు విరిగిన చెట్టు
బర్రెకు తీవ్ర గాయాలు, నడుము విరగడంతో యజమాని ఆవేదన
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి ఒక్కసారిగా చెట్టు విరిగి పడటంతో, బత్తుల ఓదెలు అనే రైతుకు చెందిన పాడి పశువుపై పడటంతో అది తీవ్రంగా గాయపడింది. పోతారం గ్రామానికి చెందిన బత్తుల ఓదెలు తన బర్రెను సమీపంలోని ప్రాంతంలో మేతకు వదిలిపెట్టారు. అదే సమయంలో అకస్మాత్తుగా వీచిన బలమైన గాలివానకు సమీపంలో ఉన్న చెట్టు విరిగి నేరుగా బర్రెపై పడింది.
ఈ ప్రమాదంలో బర్రె నడుము భాగం విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఓదెలు స్థానికుల సహాయంతో బర్రెను రక్షించే ప్రయత్నం చేశారు. పాడి పశువుపైనే ఆధారపడి జీవిస్తున్న తనకు ఈ ప్రమాదం జరగడంతో ఓదెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్క ఆధారాన్ని కోల్పోయే పరిస్థితి రావడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపోయిన తమను ఆర్థికంగా పరామర్శించాలని బాధిత రైతు కోరుతున్నారు.






