తొలివిడత ఎన్నికల్లో పరంధోలి గ్రామస్థులు
20-04-2024 12:25 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని పరంధోళి గ్రామస్థులు శుక్రవారం జరిగిన తొలి విడత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరంధోలి గ్రామం ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలోను అంతర్భాగంగా ఉండటంతో అక్కడి ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రలో తొలివిడతలో భాగంగా ఎన్నికలు జరగడంతో అక్కడి ప్రజలు కొంత మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే నెల తెలంగాణలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ పాల్గొంటారన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకేచోట ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామస్థులకు ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.






