23 May, 2026 | 10:22 AM

జియో నెట్‌వర్క్‌పై సోనాల గ్రామస్తుల పోరాటం

23-05-2026 09:49 AM

బోథ్,మే23(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రానికి చెందిన జియో వినియోగదారులంతా జియో నెట్వర్క్(Jio Network) పైన యుద్ధం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జియో వినియోగదారులకు సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెట్వర్క్ వస్తుందని బ్యాలెన్స్ వేయించుకుంటే డబ్బులు వృధా అవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

సిగ్నల్ సరిగా రావడం లేదని జియో సిబ్బందికి వివరిస్తే నిర్లక్ష్యంగా జవాబిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జియో నెట్వర్క్ ను ఎవరు వాడవద్దని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామంలో తీర్మానించుకుని ర్యాలీ నిర్వహించి ప్రజలకు వివరించడం జరిగింది. అనేక గ్రామాల్లో జియో నెట్వర్క్ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.