‘వీసాబాండ్’ భారత్‌కు ఉపశమనం
- అమెరికాకు 50 దేశాలు 20వేల డాలర్ల బాండ్ సమర్పించాల్సిందే
- భారత్‌కు మినహాయింపు
వాషింగ్టన్, ఆగస్టు 1: ఏడాదిగా తాత్కాలికంగా (పైలెట్ ప్రోగ్రామ్) అమలవుతున్న బీ-1 (వాణిజ్యం), బీ-2 (పర్యాటకం) వీసా ల జారీ కార్యక్రమాన్ని శాశ్వత ‘వీసా బాండ్’ లో భారత్‌ను చేర్చకుండా అమెరికా భారీ ఉపశమనం కల్పించింది. వీసా బాండ్ కింద వాణిజ్యం, పర్యాటకం కోసం అమెరికా వెళ్లే 50 దేశాల వారు 20వేల డాలర్ల బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో భారత్ పేరు లేకపోవడంతో అంత మొత్తం చెల్లించే అవసరం వీసాదారులకు ఉండదు.
పైలెట్ ప్రోగ్రామ్ వీసాలో కొన్ని రకాల మార్పులను చేసి విస్తృతస్తాయిలో అమల్లోకి తీసుకువచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది. ఆగస్ట్ 3 నుం చి 50 దేశాలకు ఈ నియమం వర్తించనున్నట్లు పేర్కొంది. ఈ వీసా బాండ్ కింద వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయేవారి సంఖ్య గత సంవత్సరకాలంగా గణ నీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం దీన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఈ వీసా బాండ్ పరిధిలోకి వచ్చే ప్రయాణికులు ఇక కేవలం కమర్షియల్ విమానాల్లోనే అమెరికాకు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. వీసా తిరస్కరణకు గురైన సందర్భంలో, నిర్దేశిత గడవులోగా అమెరికాలో పనులు ముగించుకొని వెళ్లే సమయంలో ఈ బాండ్ మొత్తం రీఫండ్ రూపంలో లభిస్తుంది. వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటే మాత్రం ఈ మొత్తా న్ని అమెరికా ప్రభుత్వం ఫ్రీజ్ (జప్తు) చేయనుంది.
అమెరికా ఫెడరల్ రిజిస్టర్ ప్రకారం ఆఫ్రికాలోని 30 దేశాలు, ఆసియాలోని 9 దేశాలు, ఉత్తర అమెరికా కరేబియన్ దీవుల్లోని నాలుగు దేశాలు, ఓషియానియాలోని ఐదు దేశాలు, లాటిన్ అమెరికాలోని రెండు దేశాలకు వీసా బాండ్ వర్తించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా ఈ విధానంపై పలు దేశాలు ఆవేదన వ్యక్తం చేశాయి.






