calender_icon.png 15 February, 2026 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విష్ణు విన్యాసం ఆ రోజే

15-02-2026 01:27:03 AM

శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ సినిమానున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మించారు. ఇందులో నయన సారిక కథానాయిక నటిస్తుండగా, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేశ్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీవిష్ణు విచిత్రమైన నమ్మకాలు, జాతకాలని నమ్మే యువకుడి పాత్రలో అలరించబోతున్న ఈ సినిమా.. ఒక ఫన్, కలర్ ఫుల్ సినిమాటిక్ రైడ్‌గా ఉండబోతోంది. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూరుస్తుండగా, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.