31 July, 2026 | 8:24 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

కుటుంబ కథతో విశ్వనాథ్ & సన్స్

03-03-2026 01:00 AM

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 46వ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దీన్ని తమిళ-, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. భారీ స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. త్వరలోనే టీజర్ కూడా రానుంది. అంతకన్నా ముందు మేకర్స్ ఈ మూవీ నుంచి అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటివరకు ‘సూర్య46’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు తాజాగా పేరు ఖరారైంది. ‘విశ్వనాథ్ & సన్స్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్లలో కథానాయకుడు సూర్య ఒక చిన్నారితో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఛాయాగ్రహణం: నిమిష్ రవి; కూర్పు: నవీన్ నూలి; కళ: బంగ్లాన్.