రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సందర్శన
కాజీపేటలో పనులను పరిశీలించిన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్
వరంగల్ (మహబూబాబాద్), జూలై 5 (విజయక్రాంతి): జనగామ అమృత్ స్టేషన్, కాజీపేట్‌లోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఆదివారం రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సతీష్ కుమార్ సందర్శించి, విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి తనిఖీని ప్రారంభించారు.
అక్కడ పురోగతిలోనున్న అమృత్ స్టేషన్ పనులను సమీక్షించడంతో పాటు, స్టేషన్లోని సౌకర్యాలను కూడా తనిఖీ చేశారు. కాజీపేటలోరూ.597.68కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూని ట్ను సందర్శించారు. ఈ ఆర్.ఎమ్.యూ వివిధ రకాల ఆధునిక రోలింగ్ స్టాక్ మరియు నెకస్ట్, జెన్ రైల్వే కోచ్లను తయారు చేయడానికి వాటికి నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి ఉద్దేశించ బడిన, ఆర్.ఎమ్.యూ లో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
ఆర్.వి.ఎన్.ఎల్ అధికారులు సైట్ కార్యాలయంలో అందుబాటు లోనున్న మినియేచర్ మోడల్ను ప్రదర్శిస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క భౌగోళిక స్వరూపాన్ని వివరించారు. ప్రతి యూనిట్ యొక్క కార్యాచరణ మరియు పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు. మెయిన్ షెడ్, బోగీ షాప్, పెయింట్ షాప్, వీల్ షాప్, టెస్టింగ్ షాప్లను తనిఖీ చేశారు.
ఈ తనిఖీ సందర్భంగా, ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడి, ఆర్.ఎమ్. యూలో జరుగుతున్న పనుల పురోగతి, దాని ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం ఆయన కాజీపేట నుంచి చర్లపల్లి వరకు మార్గమధ్యంలో తనిఖీ నిర్వహించారు. జనగామ రైల్వే స్టేషన్ను కూడా తనిఖీ చేసి, ప్రయాణీకుల సౌకర్యాలు, సర్క్యులేటింగ్ ఏరియా, కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులను సమీక్షించారు. రైల్వే బోర్డు చైర్మన్‌కు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి స్వాగతం పలికారు.






