12 May, 2026 | 1:23 AM

గచ్చిబౌలిలో ‘వైటాథాన్’ రన్

12-05-2026 12:11 AM

ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో చిన్నారుల కంటి క్యాన్సర్‌పై అవగాహన 

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): చిన్నారులలో వచ్చే అరుదైన కంటి క్యాన్సర్ ‘రెటినోబ్లాస్టోమా’పై అవగాహన పెంచేందుకు, పేద చిన్నారుల చికిత్సకు నిధులు సేకరించేందుకు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో గచ్చిబౌలి యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద ఈ సోమవారం ’వైటాథాన్’ రన్ ప్రారంభమైంది.

హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్ల పరుగును ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, అపోలో క్యాన్సర్ సెంటర్స్ (హైదరాబాద్) డైరెక్టర్  డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ రన్నర్స్ అధ్యక్షులు అరుణ్ కుమార్ కల్లియప్పన్ ప్రారంభించారు. 10కే పరుగును ఆల్కాన్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రీజినల్ సేల్స్ మేనేజర్ వెంకటేశ్‌రెడ్డి ప్రారంభించారు.

5కే పరుగును ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల కళ్లం అంజిరెడ్డి క్యాంపస్ హెడ్ డాక్టర్ మెర్లే ఫెర్నాండెజ్, డీజీఎమ్ - కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఎన్‌ఎండీసీ శ్రీనివాసరావు ప్రారం భించారు. ఇది ఎనిమిదో ఎడిషన్. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రశాం త్ గార్గ్ మాట్లాడుతూ.. పిల్లల్లో వచ్చే అరుదైన, తీవ్రమైన కంటి క్యాన్సర్ రెటినోబ్లాస్టోమాపై అవగాహన కల్పించడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశమన్నారు.

అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. రెటినోబ్లాస్టోమా లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవ గాహన కలిగి ఉండాలన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆపరేషన్ ఐసైట్ యూనివర్సల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐ క్యాన్సర్ (కల్లం అంజి రెడ్డి ప్రాంగణం) హెడ్ డాక్టర్ స్వాతి కలికి మాట్లాడుతూ.. ప్రజల్లో ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్‌నేత్ర వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ జీఎన్‌రావు, హైదరాబాద్ రన్నర్స్ అధ్యక్షులు అరుణ్‌కలియప్పన్ పా ల్గొన్నారు.

కాగా హాఫ్ మారథాన్ 21.1కిలోమీటర్ల పురుషుల విభాగంలో సూరజ్‌సర్కార్, తపన్‌రాయ్, మహ్మద్ షాబాజ్, మహిళల విభాగంలో సంగీతాపల్స్వాల్, మోనా, క్రిటీజైన్ వరసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 10కే పురుషుల విభాగంలో ప్రదీప్‌ఠాకూర్, విరేష్‌సారధి, రణబీర్ సింగ్ బగ్గా, మహిళల విభాగంలో కిటుషెరోన్, ఐశ్వర్య అగర్వాల్, అనిషా శర్మ మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. 5కే పురుషుల విభాగంలో మహ్మ ద్ యూనస్, ఉమేష్ బిశ్వకర్మ, వెన్నం ఆనంద్, మహిళల విభాగంలో ప్రణీకాదీక్షిత్, స్వానా, నికితాజార్జ్ మొదటి మూడుస్థానాలు గెలుచుకున్నారు.