calender_icon.png 4 January, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాటా కన్జూమర్ లాభంలో క్షీణత

24-04-2024 01:03:53 AM

ముంబై, ఏప్రిల్ 23: టెట్లీ టీ, చిం గ్స్ సీక్రెట్ నూడుల్స్ బ్రాండ్లను కలిగి న టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం క్షీణించి రూ.217 కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.269 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం మాత్రం 8.5 శాతం వృద్ధిచెంది రూ.3,927 కోట్లకు చేరినట్టు టాటా కన్జూమర్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఆదాయం చాలావరకూ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, లాభం మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. బ్రోకరేజ్ సంస్థలు రూ.329 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశాయి. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఇబిటా మార్జి న్ 190 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 16 శాతానికి చేరింది.