వొడాఫోన్ ఐడియా ఎఫ్‌పీవోకు 6 రెట్లు స్పందన
ముంబై, ఏప్రిల్ 22: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా జారీచేసిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీ వో) బిడ్డింగ్ చివరిరోజైన సోమవా రం 6.38 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. మొత్తం 1,260 కోట్ల షేర్ల ను జారీచేయగా, కడపటి సమాచా రం అందేసరికి 8,012 కోట్ల షేర్లు బిడ్ అయ్యాయి. ఆఫర్‌లో సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా పాల్గొన్నారు. సంస్థల కోసం రిజర్వ్ చేసిన షేర్లకు దాదాపు 17 రెట్లు బిడ్ చేశాయి. హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల క్యాటగిరీ 1.41 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యి ంది. ఆఫర్‌కు రూ.10 ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించారు. ఎఫ్‌పీవో ముగింపు సందర్భంగా వొడాఫోన్ ఐడియా షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 12.90 వద్ద ముగిసింది.
రిటైల్ ఇన్వెస్టర్లు దూరం
రిటైల్ ఇన్వెస్టర్లు వొడాఫోన్ ఐడి యా ఆఫర్‌కు స్పందించలేదు. రిటైలర్లకు 630 కోట్ల షేర్లను రిజర్వ్‌చేయ గా, 576 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్స్ అందాయి. రూ.18,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చిన వొడాఫోన్ ఐడియా ఎఫ్‌పీవోకు సాధారణ బిడ్డింగ్ ఏప్రిల్ 18న ప్రారంభమయ్యింది. అంతకు ముందురోజు కంపెనీ యాంకర్ ఇష్యూలో దాదా పు 60 యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించింది.. రాజీవ్ జైన్ నేతృత్వంలోని జీక్యూజీ పార్టనర్స్, ఫిడిలిటీ తదితర అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో పాటు హెచ్‌డీఎఫ్ సీ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ తదితర దేశీయ ఫండ్స్ యాంకర్ ఇన్వెస్టర్లు ఇందులో పాలుపంచుకున్నారు.






