బోయింగ్ 747కు ఎయిర్ ఇండియా గుడ్‌బై
23-04-2024 01:23 AM
ముంబై, ఏప్రిల్ 23: ‘క్వీన్ ఆఫ్‌ద స్కైస్’గా పేరొందిన బోయింగ్ 747 విమానానికి ఎయిర్ ఇండియా గుడ్‌బై చెప్పేసింది. బోయింగ్ 747 ఫ్లుటైకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చివరసారిగా వీడ్కోలు పలికినట్టు ఎయిర్ ఇండియా సోమవారం ఎక్స్ పోస్టులో తెలిపింది. ఈ ఐకానిక్ ఫ్లుటైను మిస్సవుతున్నామని పేర్కొంది. ముంబై నుంచి టేకాఫ్ అయిన ఈ డబుల్ డెక్కర్ విమానం యూఎస్‌లోని ప్లెయిన్‌ఫీల్డ్‌లో ల్యాండ్ అవుతుంది. అక్కడ దానిని విడిభాగాలుగా విభజిస్తారు. దీంతో విమానయాన చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం ముగిసినట్టే.






