26 April, 2026 | 2:22 AM

తెలంగాణ అభివృద్ధికి ఓటేయండి

11-05-2024 02:24 AM

మేయర్ పారిజాతా నర్సింహరెడ్డి

మహేశ్వరం, మే 10 : తెలంగాణ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయ ర్ పారిజాతా నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో పాటు ఓటర్లకు అవగాహన కల్పించారు. వీవీ ప్యాట్ అంటే ఏమిటి? ఓటు ఎలా వేయాలి అనే సందేహాలను నివృత్తి చేశారు. ఓటు వేసే సమయంలో ప్రలోభలకు లొం గకుండా తెలంగాణ అభివృద్ధిని దృష్టి లో పెట్టుకొని ఓటు వేయాలని ఆమె సూచించారు.