26 April, 2026 | 4:01 AM

నేడు వికారాబాద్ జిల్లాకు అమిత్ షా

11-05-2024 02:19 AM

వికారాబాద్, మే 10 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల ప్రచా రం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు ప్రధా న పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు వికారాబాద్‌కు వస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక ఎస్‌ఏపీ మైదానంలో 12గంటలకు నిర్వ హించే బహిరంగ సభలో పాల్గొనున్నారు. జాతీయస్థాయి నాయకుడు వస్తుండటంతో బీజేపీ శ్రేణులు సభ ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. హెలిప్యాడ్, సభా వేదికను ప్రత్యేక బలగాలు తమ ఆధీనం లోకి తీసుకోని భద్రతపరమైన చర్య లు తీసుకుంటున్నాయి.