15 July, 2026 | 1:20 AM

ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్‌ఓలకు ఇవ్వాలి

15-07-2026 01:19 AM

మున్సిపల్ కమిషనర్ మహముద్ షేక్

కల్వకుర్తి జులై 14 : ఓటరు ఎన్యూమరేషన్ పారాలను బిఎల్‌ఓలకు అందజేయాలని లేనియెడల ఓటును కోల్పోయే అవకాశాలు ఉంటాయని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ అన్నారు. మంగళవారం పట్టణ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు పట్టణ ప్రజలకు పలు సూచనలు చేశారు. పట్టణంలో ఇప్పటి వరకు కేవలం 55 శాతం ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయన్నారు.

ఓటర్లలో ఎవరికైనా డబుల్ ఓట్లు ఉన్నా, కుటుంబ సభ్యులు మరణించి వారి పేర్లు తొలగించాల్సి ఉన్నా, తమ స్వగ్రామంలోనే ఓటు కొనసాగించాలనుకున్నా, సంబంధిత వివరాలను వెంటనే తమ పరిధి బిఎల్వోలకు సమర్పించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి బిఎల్వోలకు అందజేయకపోయినా, అవసరమైన వివరాలను తెలియజేయకపోయినా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు.