10-02-2026 02:09:00 AM
బీజేపీ సీనియర్ నేత శశిధర్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): గతంలో కార్ స్టీరింగ్ తమ చేతిలో ఉంది అని చెప్పిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ.. ఇప్పుడు కాంగ్రెస్ స్టీరింగ్ కూడా ఆయన చేతిలోనే ఉందని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కి ఓటు వేసినట్లేనన్నారు.
ప్రజలు రెండు పార్టీలను గమనించి బీజేపీకి ఓటు వెయ్యాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ప్రజలు బుద్ధి చెప్పాలని, సోషల్ మీడియా లో పోస్టులు పెడితే కేసులు పెట్టే పోలీసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడంలేదని ప్రశ్నించా రు. సీఎం పేరు చెప్పి ఫహీమ్ ఖురేషి వక్ఫ్ భూములను కొల్లగొడుతున్నారన్నారు.