calender_icon.png 10 February, 2026 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరీబోళ్లకు అండగా కాంగ్రెస్

10-02-2026 01:57:07 AM

  1. మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇవ్వాలి
  2. అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
  3. ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

ఆర్మూర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో గరీబోళ్లకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్ కోరారు. ఆర్మూర్ పట్టణం లో ఎన్నికల ప్రచార సభను సోమవారం నిర్వహించారు. పీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్(చిన్న) అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, ఓడిపోయిన జీవన్‌రెడ్డితో పట్టణ అభివృద్ధి సాధ్యం కాదన్నా రు. కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లుగా విజ యం సాధిస్తేనే ఆర్మూర్ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఆరు నెలల్లో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామన్నారు. తమ హయాంలో అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులలో కాంగ్రెస్ అ భ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ఖాతాలో వే యాలన్నారు.  సభలో నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబా బగౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.