11-02-2026 03:58:53 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలములోని వడల్‌పర్తి గ్రామంలో ఫెర్టిలిటీ అండ్ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని మండల పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ... వదలపర్తి గ్రామంలో 34 పశువులకు గర్భధారణ నిర్ధారణ తనిఖీ పూర్తయిందనీ అందులో చుడికట్టినవి 8 కాగా, గర్భకోశ వ్యాధి చికిత్సలు 12 పశువులకు చేయడం జరిగిందన్నారు.
13 దూడలకు నత్తల మందు ఇవ్వగా, మేకలు,పశువులకు కలిపి 42 సాధారణ చికిత్సలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ, ఉప సర్పంచ్ శ్యామల గంగారాం, పశు వైద్యాధికారి రవి కుమార్, విఏఎస్ విజయ, గ్రామ కార్యదర్శి అజీమొధీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.