2 September, 2026 | 4:32 AM

ఖానాపూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల వార్

02-09-2026 | 02:20am

పరస్పరం విమర్శలు 

ఖానాపూర్ సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి) నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కౌన్సిలర్ల వార్ కొనసాగుతుంది. ఖానాపూర్ మున్సిపాలిటీ (Khanapur Municipality) అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ బిజెపి కౌన్సిలర్ల (Congress BJP councilors) మధ్య పరస్పర విమర్శలు ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. మున్సిపల్ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ సహకరించాల్సి వుండగా అభివృద్ధిని అడ్డుకుంటున్నా రని అదికార కాంగ్రెస్ బిజెపి చైర్మన్, కౌన్సిలర్లు బహిరంగంగా విమర్శించడం మున్సిప ల్ అభివృద్ధిపై ప్రభావాన్ని చూపనున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.

మూడు రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సమావేశంలో కాంగ్రెస్ బిజెపి టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా బిజెపి కూటమిగా ఏర్పడి ఏడువార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్నారు.

ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చివరి వరకు ప్రయత్నించి విఫల మయ్యారు. అప్పటినుండి మున్సిపాలిటీలో అభివృద్ధి విషయంలో నువ్వా మేమా అని పరస్పరం మూడు పార్టీల మధ్య కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అభివృద్ధి ని పక్కనపెట్టి మున్సిపల్ పాలనను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి. 

అభివృద్ధికి సహకరిస్తాం.. దోపిడిని అడ్డుకుంటాం : 11వ వార్డు కౌన్సిలర్, డీసీసీ ఉపాధ్యక్షులు రాజుర సత్యం

ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేయాల్సింది పోగా ప్రజాధనాన్ని చైర్మన్ మౌనిక వ్యర్థంగా ఖర్చు చేస్తున్నారని, దానికి నిదర్శనంగా కారు అద్దె రూ. 33,000 ప్రతినెల ఖర్చు చేయడం ,ప్రమాణ స్వీకారం కో సం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పిలుచుకొని రూ.75000 ఖర్చు చేయడం సొంత వార్డులోనే ఇందిరమ్మ గృహాలకు అక్రమంగా డబ్బు వసూలు చేయడం వంటివి శోచనీయమని వీటిని అడ్డుకునేందుకు తాము ఎప్పుడు పోరాటం చేస్తామని అన్నారు.

అభివృద్ధి కోసం తమ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ ఎల్లప్పుడు సహకరించారని దాంట్లో భాగంగానే బుడ్డోని కుంట, పి హెచ్ సి భవనం, సిసి రోడ్లు, వంటి వాటికీ నిధులు కేటాయించడం చేసామని చైర్మన్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ,పెన్షన్లు ,రేషన్ కార్డు, పంపిణీలో ఎక్కడ అక్రమాలు జరిగినా తమకు ఫిర్యాదు చేయాలని అన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం బిజెపి కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అభివృద్ధికి సహకరించడం లేదని అంతేకాకుండా అధికారులను వేధిస్తూ చైర్మన్ కు సహకరించొద్దని సతాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దాంతో అభివృద్ధి కొంటుపడే ప్రమాదం ఉందని మున్సిపల్ చైర్మన్ అంక మౌనిక మహేందర్ అన్నారు.

 మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్