calender_icon.png 11 January, 2026 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా డెన్మార్క్ మధ్య వాగ్యుద్ధం

11-01-2026 01:09:28 AM

గ్రీన్‌ల్యాండ్ విషయంలో పోటాపోటీ ప్రకటనలు

ఆర్కిటిక్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు

కోపెన్ హెగన్, జనవరి ౧౦: గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా  దేశాల మధ్య వాగ్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఈ ద్వీపాన్ని దక్కించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పట్టింపుగా ఉండ టంతో సమస్య తీవ్ర తరమవుతున్నది. ట్రంప్ వైఖరిని డెన్మార్క్ ప్రభుత్వం తప్పుబడుతున్నది. గ్రీన్‌ల్యాండ్‌కు ఎలాంటి హాని కలిగినా తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు జారీ చేసింది. అమెరికన్ సైనికులెవరైనా గ్రీన్‌ల్యాండ్ వైపు వస్తే మరో ఆలోచన లేకుండా కాల్పులకు దిగాలని ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆర్కిటిక్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికన్ సైన్యం బంధించిన తర్వాత, అమెరికా కన్ను గ్రీన్‌ల్యాండ్‌పైనా పడింది. వెనిజులా తరహాలోనే గ్రీన్లాండ్ ను కూడా స్వాధీనం చేసుకుంటామని అమెరికా సంకేతాలు ఇవ్వడం యూరప్ దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.