calender_icon.png 11 January, 2026 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసు

11-01-2026 02:39:58 PM

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించి, ఆరుగురు ప్రధాన నిందితులు అరెస్ట్ చేశారు. నిందితులు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, ఆర్థిక ప్రోత్సాహకాల హామీలతో అనేక మంది బాధితులను ఆకర్షించి రూ.547 కోట్లను కొల్లగొట్టారు. నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు అయ్యాయని, అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో సైబర్ నేరాలు జతకట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ సైబర్ క్రైమ్‌లకు పాల్పడిన నిందితులు మ్యాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలు భారతీయ న్యాయ సంహిత 2023, సమాచార సాంకేతిక చట్టం 2000 కిందకు వస్తాయి. ఈ నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.