calender_icon.png 11 January, 2026 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం కోర్టుకు ‘ఐవూ దాడుల వ్యవహారం

11-01-2026 01:11:07 AM

అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈడీ, బెంగాల్ ప్రభుత్వం

కోల్‌కతా, జనవరి 10: బొగ్గు కుంభకోణం విషయంలో పశ్చిమ బెంగాల్‌ని ఐ కార్యాలయంపై జరిగిన ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈడీతోపాటు బెంగాల్ ప్రభుత్వం పరస్పరం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వివాదంపై కలకత్తా హైకోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే కోర్టు హాల్లో న్యాయవాదుల రద్దీ, గందరగోళ పరిస్థితుల కారణంగా విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జనవరి 14వ తేదీకి కోర్టు తరలించింది. ఈ లోపు ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరిం చుకుంది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ డైరెక్టర్ ప్రతీక్‌జైన్ నివాసంలో ఈడీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆటంకం కలిగించిందని ఈడీ గట్టిగా ఆరోపిస్తోంది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోదాలు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకున్నారని ఈడీ పేర్కొంది. ముఖ్యమంత్రి మమత జోక్యం చేసుకోవడమే కాకుండా కొన్ని కీలక ఆధారాలను తనతో పాటు తీసుకెళ్లిపోయారని ఆరోపించింది. మరోవైపు బెంగాల్ ప్రభు త్వం కూడా అప్రమత్తమైంది. ఈ కేసు లో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఏకపక్ష ఆదేశాలు ఇవ్వకూడదని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర సం స్థలు రాష్ట్ర పరిధిలో అక్రమంగా జోక్యం చే సుకుంటున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.