11-01-2026 10:33:35 AM
మరొకరి పరిస్థితి విషమం
టేకులపల్లి,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన శనివారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. టేకులపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సులానగర్ గ్రామానికి చెందిన చిలకబత్తిన రవి(45), గనమల్ల భిక్షం ఇరువురు పాకాల కొత్తగూడెం ఏరియాలో తాపీ మేస్త్రిగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు వెళ్లారు.
ఆదివారం చర్చికి రావాల్సిన సందర్భంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆరవ మైలు సమీపంలోని ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును చెట్టును ఢీకొని చిలకబత్తిన రవి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం వెనుక వైపు కూర్చున్న ఘనమల్ల భిక్షం కు బలమైన గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతి చెందిన రవికు భార్య కూతురు కలరు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.