calender_icon.png 11 January, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

11-01-2026 11:03:04 AM

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా నగర వాసులంతా స్వగ్రామలకు పయనమయ్యారు. సొంతాళ్లకు వెళ్ళే వాహనాలతో హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెలవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్న వాహనాలతో రద్దీ పెరగడంతో  చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.  దీంతో ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం టోల్ ప్లాజా సిబ్బంది 10 టోల్ బూత్ లను, ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల కోసం 6 టోల్ బూత్ లు ఓపెన్ చేశారు.