21 May, 2026 | 2:41 AM

అగ్ని గోళంగా వరంగల్

21-05-2026 12:00 AM

హనుమకొండలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత

మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి) : వరంగల్ జిల్లాలో బుధవారం ఎండ మండిపోవడంతో అగ్ని గోళంగా మారింది.  అత్యధికంగా హనుమకొండలో 44.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మహబూబాబాద్ లో 44.5 వరంగల్ లో 44.4 జనగామలో 44.3 ములుగులో 44.5 ఉప్పలపల్లిలో 44.2 డిగ్రీల పదవి ఉష్ణోగ్రత న మోదైంది. తీవ్రమైన ఎండకు తోడు వడ గాలికి జనం సతమతమయ్యారు. మరో రెం డు రోజులపాటు ఎండ తీవ్రత ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచిస్తున్నది.