30 July, 2026 | 5:47 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

అరెస్ట్‌లు ఎందుకు?

21-05-2026 12:00 AM

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రైతుల సమస్యలపై ప్రభుత్వం వినతిపత్రాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేదని తెలుస్తున్నదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ తెలిపారు. ధాన్యం కొనుగో లు చేయాలని, రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు, మండల స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తమ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు పిలుపునిస్తే ముందస్తు అరెస్టులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావుతో పాటు జిల్లాల్లో అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంటూ బుధవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.