4 July, 2026 | 1:09 PM

16వ వార్డులో వార్డు కమిటీకి శ్రీకారం

04-07-2026 12:09 PM

ఇల్లందు, జూలై 4 (విజయక్రాంతి): వార్డు స్థాయి పాలనను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇల్లందు మున్సిపాలిటీ 16వ వార్డులో వార్డు కమిటీని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ ఉల్లింగ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోళ్ల సూర్యం పాల్గొని కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా వార్డు కమిటీ వ్యవహరించాలని, వార్డులోని సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా ప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.