4 July, 2026 | 1:46 PM

కవితకు ఈసీ బిగ్ షాక్.. TRS పేరుపై ఈసీ కీలక ఆదేశాలు

04-07-2026 12:40 PM

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) బిగ్ షాకిచ్చింది. కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై(Telangana Rakshana Sena) ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందేనని సూచించింది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని ఈసీ వెల్లడించింది.

టీఆర్ఎస్(TRS) పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయినందున, ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు  సీఈసీ లేఖ రాసింది. ఎన్నికల సంఘం లేఖపై స్పందించిన టీఆర్ఎస్ అధినేత్రి కవిత సమాధానాలు పంపింది. కేవలం రెండు అభ్యంతరాలు మాత్రమే తమకు పంపినట్లు లేఖలో వెల్లడించారు. మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దేశంలోని చాలా పార్టీల సంక్షిప్త నామాలు ఒకేలా ఉన్నాయని తెలిపారు. పార్టీ పేరుపై వెనకడుగు వేసేది లేదని తేల్చిచెప్పిన కవిత పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయం పోరాటం చేస్తామని పేర్కొన్నారు.