4 July, 2026 | 2:28 PM

49వ డివిజన్ లో రూ. 44 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

04-07-2026 01:08 PM

ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ 

ముకరంపుర, జూలై 4(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్ సంతోష్ నగర్ లోని సంతోషిమాత రోడ్ లో మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ. 41 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్  ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సంతోష్ నగర్ లోని సంతోషిమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తో పాటు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్,  యాదగిరి సునీల్ రావు ,49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి-ప్రకాష్ , బీజేపీ కార్పొరేటర్లు,పార్టీ నాయకులు, బీజేపీ శ్రేణులు, 49వ డివిజన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.