4 July, 2026 | 1:09 PM

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

04-07-2026 12:19 PM

కూకట్‌పల్లి: హైదరాబాద్ నగరం కూకట్‌పల్లిలోని(Kukatpally)"ఫ్యూజన్ ఫర్నిచర్ షోరూమ్"లో(Fusion Furniture Showroom) శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షోరూమ్ నుండి దట్టమైన పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాద ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో భారీగా ఫర్నిచర్‌ కాలిపోవడంతో ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు.