15 April, 2026 | 2:14 AM

5వ వార్డును అభివృద్ధి చేస్తా

11-12-2025 12:19 AM

గెలుపు దిశగా ఎర్రగడ్డం శైలజ--రాజశేఖర్‌రెడ్డి

బోయినపల్లి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామంలో 5వ వార్డును అభివృద్ధి చేస్తానని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న ఎర్రగడ్డం శైలజరాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం 5వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మామ స్వర్గీయ ఎర్రగడ్డం  సంజీవరెడ్డి బాటలో పయనించి వార్డులో వీధి లైట్లు అమర్చి, డ్రైనేజీ పునర్ నిర్మాణం చేయిస్తానని చెప్పారు. వార్డులోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే వార్డులోని సమస్యలను, పనులన్నీ సకాలంలో పరిష్కారం చేయనున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారం చేస్తానన్నారు.