ఆశీర్వదించండి.. అందుబాటులో ఉంటా
- కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి
- తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి గంకిడి లక్ష్మారెడ్డి
తిమ్మాపూర్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఒక్కసారి అవకాశం కల్పించండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ అభ్యర్థి గం గిడి లక్ష్మారెడ్డి తిమ్మాపూర్ గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ జనం తో మమేకమై ప్రభంజనంలా దూసుకువెళ్తున్నా రు ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓ టెయ్యండి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో మండలంలోనే అభివృద్ధిలో తిమ్మాపూర్ అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇస్తున్నారు.
గ్రామం లోని నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ఉంటా అంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మం జూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీలు నిరంతరం శుభ్రం చేయించడం, నిరుపేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని అన్నారు. స్థానిక సమస్యలపైన అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం. ఖచ్చితంగా తాను గ్రామ ప్రజలం దరి సహకారంతో సర్పంచ్‌గా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రచార కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




