11-12-2025 12:17:44 AM
తంగళ్లపల్లి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి అంకారపు రవీందర్ కత్తెర గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని వివిధ వర్గాలను సందర్శిస్తూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ, అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. అభ్యర్థి అంకారపు రవీందర్‌తో కలిసి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటూ మద్దతు తెలిపారు.
మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజ బింకార్ రాజన్న, మాజీ సర్పంచులు సంధ్యారాణి, అనిత, నాయకులు బండి జగన్, ఎగుర్ల కనకరాజు, నేరెళ్ల అనిల్ రంగా ప్రసాద్, దుర్గయ్య, తిరుపతి, పరశురాములు తదితరులు కలిసి ప్రజలను కత్తెర గుర్తుకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల మెరు గుదల, శుద్ధి నీటి సమస్య పరిష్కారం, కాలనీల అభివృద్ధి వంటి అంశాలపై రవీందర్ తన ప్రణాళికలను ప్రజలకు వివరించగా, పలువురు స్థానికులు సానుకూలంగా స్పందించారు.