21 August, 2026 | 9:47 PM

Breaking News

ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •  

భారీ వర్షం... నీట మునిగిన 15వ వార్డు

01-09-2024 08:10 PM

లక్షెట్టిపేట, (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని 15వ వార్డు కాలనీలో శనివారం  కురుస్తున్న వర్షానికి 15వ వార్డు అంకతివాడ నీట మునిగింది. కాలనీలో రోడ్లు లేకపోవడంతో కాలనీలో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు వేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని.. ఇప్పటికైనా రోడ్డు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.