calender_icon.png 2 November, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

02-11-2025 12:00:00 AM

మేడిపల్లి, నవంబర్ 1 (విజయక్రాంతి): బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మున్సిపల్  కమిషనర్ ఏ. శైలజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లపై అధిక చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి, అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి,  ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇచ్చట చెత్త వేయరాదు వేచినచో 25 వేల రూపాయల వరకు జరిమానా విధించబడును అని హెచ్చరిక  బోర్డులను ఏర్పాటు చేశామని, వాటిని ఉల్లఘించినచో శిక్షార్హులని ఆమె తెలిపారు. స్వచ్ఛ వాహనంలో మాత్రమే చెత్తను వేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.