calender_icon.png 3 November, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్టి బుర్రలు గట్టి ఆలోచనలు

02-11-2025 12:00:00 AM

నాచారం జాన్సన్ గ్రామర్ స్కూల్ సైన్స్ ఫెయిర్ సందడి

ఉప్పల్, నవంబర్ 1 (విజయక్రాంతి) : చిట్టి బుర్రలతో గట్టి ఆలోచనలు చేసి సైన్స్ స్క్వేర్ ద్వారా తమ ప్రతిభ చాటుకున్నారు. నాచారం జాన్సర్ సీబీఎస్సీ గ్రామర్ స్కూల్లో  శనివారం విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. సృజనాత్మకమైన   ఆలోచనలు వేదికగా ఈ ప్రదర్శన  పలువురుని ఆకట్టుకుంది.

తమ చిట్టి బుర్రలతో  పర్యావరణ పరిరక్షణ రోబోటిక్స్ శక్తి వనరుల వినియోగం అంతరిక్ష పరిశోధన వంటి విభాగాల్లో  ఆధునిక ఆవిష్కరణను ప్రతిబింబించే విధంగా ప్రాజెక్టులు అటు తల్లిదండ్రు లను ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. ఇలాంటి ప్రదర్శనలు స్కూల్లో యజమాన్యా పెట్టడం ద్వారా  తమ యొక్క పిల్లల  ఆలోచన శక్తిని పరిశోధన దృక్పధాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో దోహదపడతాయని  విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.