ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారికి హెచ్చరిక
12-03-2026 12:44 AM
కరీంనగర్ క్రైం, మార్చి 11 (విజయ క్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం ఎల్లబోతారం, వల్లంపహాడ్, నగునూరు గ్రామ శివారులో గల మూల వాగులో కొందరు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో వాగు పరిసరాలలో పెట్రోలింగ్ నిర్వహించగా ఎలబోతారం గ్రామానికి చెందిన పైడి అజయ్ వాగు నుండి ఇసుకను దొంగలించి తన ట్రాక్టర్ నందు ఇసుకను నింపుకొని కరీంనగర్ వైపునకు తరలిస్తుండగా వల్లంపహడ్ బ్రిడ్జి వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు.
ట్రాక్టర్ ను సీజ్ చేసి నిందితుడి పై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.




