6 April, 2026 | 4:50 PM

Breaking News

కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •  

వృథా అవుతున్న మంజీరా జలాలు

11-02-2026 03:18 AM
  1. నదిని తలపిస్తున్నచెన్నాపురం రోడ్డు
  2. నీటి వృథాను అరికట్టాలని ప్రజల వేడుకోలు

జవహర్ నగర్ ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): కీసర సర్కిల్ పరిధిలోని జిహెచ్ ఎంసి జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తాలో మంగళవారం మంచినీటి పైప్ లైన్ లీక్ అయి మంచినీరు వృథాగా రోడ్డుమీద ప్రవహించింది.ఈ సందర్భంగా చెన్నాపురం వాసులు మీడియాతో మాట్లాడుతూ మంజీరా నీరు భారీ ఎత్తున వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జవహర్ నగర్లో అసలేనీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మురికినీటి బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి) అధికారులు నిర్లక్ష్యంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని  మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి  నీటి వృధాను అరికట్టాలని జవహర్ నగర్ ప్రజలు కోరుతున్నారు.