calender_icon.png 12 February, 2026 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఎస్‌ఆర్ మాల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం

11-02-2026 03:19:51 AM

తృటిలో తప్పిన ప్రాణ నష్టం

శేరిలింగంపల్లి,పిబ్రవరి 10 (విజయక్రాంతి) : మియాపూర్ సర్కిల్ మదినగూడ లోనీ జేఎస్‌ఆర్ మాల్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒకే బిల్డింగ్ లో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, క్లిన్సింక్ క్లీనికల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. కాగా రెండవ సెల్లార్ లో ఉన్న క్లిన్సింక్ క్లినికల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

సెల్లార్ లోని ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగ అలుముకుంది.అదే భవనంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలో ఊపిరి ఆడక పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతూ భయంతో బయటకు పరు గులు తీసారు. విద్యార్థుల భారీ అరుపులతో స్థానికంగా భయాందోళన వాతావర ణం నెలకొంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకు న్నారు.

తమ పిల్లల క్షేమంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యా సంస్థను నడుపుతున్నారని నారాయణ సంస్థపై మండిపడుతు న్నారు. ఐదు అంతస్తుల్లో సుమారు 2000 వేల మంది విద్యార్థులు ఉండడం, ఒక్క పదవ తరగతిలోనే సుమారు 300 మంది విద్యార్థులు అభ్యసిస్తుండడం చర్చనీయాం శం. అదేవిధంగా క్లిన్సింక్ క్లినికల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా సరైన అనుమతులు లేవని సమాచారం.

అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అదే బిల్డింగ్‌లో ముందు ఓ హోటల్, మరో సూపర్ మార్కెట్ కొనసాగుతుండగా అగ్నిప్రమాదం జరిగిన సమీపంలో భారీ ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఉండడంతో తృటిలో భారీ ప్రాణనష్టం తప్పేంది. అగ్ని ప్రమాదానికి కారణమైన అంశాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని,తమ పిల్లలకు సరైన రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.