దేశంలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి
భద్రాద్రి కొత్తగూడెం, మే 25 (విజయక్రాంతి): గడిచిన పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆత్మగౌరవంగా ఓటు వేయాలని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా దేశాన్ని 11వ స్థానం నుంచి ఐదో స్థానంలో నిలిపిన ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల ప్రచారం ముగింపు రోజైన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈటల విస్తృతంగా పర్యటించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్య ర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో కొత్తగూడెంలోని క్లబ్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఆచరణకు సాధ్యం కాని హామీల గుప్పిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దని అన్నారు.
విచ్చలవిడిగా చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా గతంలో బీఆర్‌ఎస్ మోసం చేస్తే.. అదేబాటలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం నడుస్తోందని విమర్శించారు. లక్ష రూ పాయలే మాఫీ చేయలేక కేసీఆర్ చేతులెత్తేశారని, ఇప్పుడు 2లక్షల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలకు సత్యదూరపు హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాటలను మేధావులు నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రశ్నించే గొంతుకలు కాదనీ, అధికారానికి మోకరిల్లే గొంతులని ఎద్దేవా చేశారు. ప్రభు త్వ వైఫల్యాలను నిలదీసే శక్తి ఒక్క బీజేపీకే ఉందని పేర్కొన్నారు.
మోదీ పాలనలో సంక్షే మ, అభివృద్ధి సమపాళ్లలో సాగుతున్నాయన్నారు. దేశంలో శాంతియుత వాతావర ణం నెలకొందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా దేశాన్ని తీర్చిదిద్దుతున్న మోదీ బలపరిచేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్య ర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఈటల కోరారు. ఈటల వెంట ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు వినోద్‌రావు, సీతారాం నాయక్, బీజే పీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్, మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జీవీకే మనోహర్ పాల్గొన్నారు.






