7 August, 2026 | 11:28 PM

జీవో 46 రద్దు బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

26-05-2024 02:33 AM

హనుమకొండ, మే 25 (విజయక్రాంతి): జీవో 46 రద్దు బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, సమాజ అభివృద్ధికి ఎవరు అవసరమో పట్టభద్రులు ఆలోచన చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి కోరారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో మాట్లాడారు. విజన్ లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిస్థితులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాటికి పూర్తిగా మారాయని చెప్పారు. 34 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పట్ల ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందని తెలిపారు.

చట్టసభల గౌరవం పెంచడానికి అన్నివిధాలా కృషి చేస్తానన్నారు. గొప్పగొప్ప మేధా వులు, నాయకులు ఉండే సభలోకి చిల్లర, బ్లాక్‌మెయిల్ గాళ్లకు స్థానం లేదన్నారు. ప్రభుత్వానికి తొత్తుగా ఉండే వాళ్లు కావా లా? ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రశ్నించే అభ్యర్థి కావాలా? ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు ఒడితల సతీశ్, దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు.