పోరాడుతా.. గెలిపించండి
మునుగోడు, మే 25 : మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అమలు చేసిందని నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న స్పష్టంచేశారు. తనను గెలిపించి పట్టభద్రుల పోరాడే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడులో డీసీసీబీ డైరెక్టర్, మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుమ్మం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ పట్టభద్రుల సన్నాహ క సమావేశంలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ప్రజల పక్షాన గొంతు ఎత్తుతారో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులను పల్లి బఠానీలు అమ్ముకునే వారని కేటీఆర్ అన్నారని.. అహంకారంతో మాట్లాడి పట్టభద్రుల నుంచి ఓట్లు ఎలా అడుగుతున్నావని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోలివ్వాలని నిలిదీసినందుకే తనపై 56 కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. కేసీఆర్ కూతు రు కవితను ఎందుకు జైలుకు పంపించారో చెప్పాలని డిమాండ్ చేశారు.






