7 March, 2026 | 11:19 PM

మంచి నీరు అందిచడమే మా లక్ష్యం

07-03-2026 09:43 PM

కరీంనగర్,(విజయక్రాంతి): డివిజన్లో మంచినీరు అందించడం మా ప్రధాన లక్ష్యమని 19వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని వాటర్ ట్యాంక్, ప్యారడైస్ స్కూల్ ముందు గల వాటర్ ట్యాంక్ లకు రెండింటికి కలిపి వాటర్ పైపు లైన్ లింక్ కలపడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... ఈ లింక్ తో హనుమాన్ నగర్, సాలెహ్ నగర్, టీచర్స్ కాలనీ, పాతపల్లెలకు మరింత వేగంగా మంచి నీరు అందుతాయని తెలిపారు, మిగిలిన కాలనీ లకు అతి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.