31 July, 2026 | 1:14 PM

సీతారాంపల్లిలో పౌర హక్కుల దినోత్సవం

31-07-2026 12:25 PM

దళిత సంక్షేమ పథకాలపై అవగాహన.. ప్రభుత్వ వసతులు వినియోగించుకోవాలని సూచన

సిద్దిపేట రూరల్, జూలై 31: మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ఎస్సీ వెల్ఫేర్ శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బి. మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, వసతి తదితర సౌకర్యాలను ప్రతి అర్హులూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సామాజిక సమానత్వం సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్‌ఐ కవిత, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.