4 May, 2026 | 2:46 PM

Breaking News

మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •   జిల్లాలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు   •  

నీళ్లు రాక రోడ్డుపై బైఠాయింపు

11-11-2025 12:09 AM

ఆలేరు, నవంబర్ 10  (విజయ క్రాంతి): - ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని ఒకటవ వార్డు బస్టాండ్ వెనుక జంగాల కాలనీలో గల బోర్ వాటర్  వార్డు ప్రజలకు వాటర్ సప్లై రాక నెల రోజులు అవుతున్న పట్టించుకునే నాధుడే లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీరా గ్రామపంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని తెలుపగా వారు చెక్ చేయగా పైప్ లైన్ పాడైపోయిందని వారు తెలిపారు. 120 మీటర్ల పైప్ లైన్ దానికి కావాలని గ్రామపంచాయతీలో నిధులు లేక పైపు వేయలేక పోతున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వార్డు మహిళ ఎల్లమ్మ మాట్లాడుతూ నెల రోజులుగా నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు స్పందించి మాకు నీళ్లు ఇప్పించగలరని వారు మీడియా ముఖంగా కోరారు.ఈ వార్డు ప్రజల సమస్యలను తీర్చే ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే మా సమస్యను పరిష్కారం చేయాలని వార్డు ప్రజలు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో స్వప్న, బాలమణి, సత్తెమ్మ, లచ్చమ్మ, రమ్య, మంజుల, మంగమ్మ, రజిత, అనిత,చెండెమ్మ, విజయలక్ష్మి, రాజిరెడ్డి, చంద్రమౌళి గౌడ్, నరసయ్య, కిష్టయ్య, విశ్వనాథం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.